సమ్మెపై కమిటీ వేయాలా?

ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని, దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని రేపు చెప్పాలని హైకోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోరింది. ఆర్టీసీ సమ్మెపై [more]

Update: 2019-11-12 11:25 GMT

ఆర్టీసీ సమ్మెపై ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని, దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని రేపు చెప్పాలని హైకోర్టు ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోరింది. ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఏపీఎస్ ఆర్టీసీ ఉండగా ఎస్మా ప్రయోగించారని, ఇప్పుడు కూడా ఎస్మా ప్రయోగం చేసేలా ఆదేశివ్వాలని కోరింది. ఏపీఎస్ ఆర్టీసీలో ఎస్మా ప్రయోగించారని, అది టీఎస్ ఆర్టీసీలో ఎలా ప్రయోగిస్తారని ప్రశ్నించింది, గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తించవని కోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చించాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలు జరపాలని ఎలా ఆదేశించగలమని అడిగింది. ఆర్టీసీ సమ్మై పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Tags:    

Similar News