తెలంగాణ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది

క్లిష్ట సమయంలోనూ తెలంగాణలో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. జాతీయ స్థాయిలో కంటే తెలంగాణలో వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర [more]

Update: 2021-08-23 07:01 GMT

క్లిష్ట సమయంలోనూ తెలంగాణలో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. జాతీయ స్థాయిలో కంటే తెలంగాణలో వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలది అవగాహనారాహిత్యమని హరీశ్ రావు అన్నారు. రాజకీయ లబ్ది కోసమే వారు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను అనుసరించే తాను మాట్లాడుతున్నానని హరీశ్ రావు చెప్పారు. దేశంలో వృద్ధి రేటు 50 శాతం మాత్రమే ఉందన్నారు. దేశంలో కంటే తెలంగాణలో వృద్ధి రేటు ఎక్కువగా ఉందని హరీశ్ రావు చెప్పారు.

Tags:    

Similar News