లాక్ డౌన్ లోనూ లాగించేస్తున్నారుగా

ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. అక్రమార్కులు మాత్రం తమ పని తాము చేసుకుని వెళ్తున్నారు . డబ్బులు సంపాదించుకున్న వారు వక్ర మార్గాల్లో సంపాదిస్తూనే ఉన్నారు. ఇందుకు [more]

Update: 2020-05-05 01:52 GMT

ఒకపక్క దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. అక్రమార్కులు మాత్రం తమ పని తాము చేసుకుని వెళ్తున్నారు . డబ్బులు సంపాదించుకున్న వారు వక్ర మార్గాల్లో సంపాదిస్తూనే ఉన్నారు. ఇందుకు హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో గత కొన్నాళ్ల నుంచి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి రాచకొండ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆపరేషన్ చేసి ఆసుపత్రిలోని డాక్టరుని డైరెక్టర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ప్రయివేటు ఆసుపత్రిలో….

ఉప్పల్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లుగా రాచకొండ ఎస్ వో టి పోలీసులకు సమాచారం వచ్చింది. ఇందులో గత ఆరు నెలల నుంచి కూడా ఈ పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం . గర్భంలో శిశువు ఉండగానే ఆడ మగ అని తెలుసుకొని ఆదిలోనే చిదిమేస్తున్నారు . ఆడపిల్లలైతే అబార్షన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆరు నెలల ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలకు వీళ్ళు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు . ఇందుకు సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దొడ్డిదారిన లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న డాక్టర్లు తో పాటుగా ఆస్పత్రి డైరెక్టర్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇద్దరు డాక్టర్లు పై కేసు నమోదు చేశారు. గత కొన్నాళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పోలీసులు బట్టబయలు చేశారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో నాలుగు ఆస్పత్రుల పైన అధికారులు లింగ నిర్ధారణకు సంబంధించి ఆపరేషన్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది . అయినప్పటికీ కూడా ఈ ఆసుపత్రి వర్గాలు మాత్రం ధైర్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Tags:    

Similar News