హైదరాబాద్ లో నకిలీ మద్యం

ఎన్నికల్లు అంటే చాలు మద్యం , డబ్బు లేనిదే జరగదు.. మద్యం విచ్చల విడిగా సరఫరా చేసిన వారే గెలుస్తారని నమ్మకం. ఇప్పడు చీప్ లిక్కర్ ను [more]

Update: 2019-08-19 14:12 GMT

ఎన్నికల్లు అంటే చాలు మద్యం , డబ్బు లేనిదే జరగదు.. మద్యం విచ్చల విడిగా సరఫరా చేసిన వారే గెలుస్తారని నమ్మకం. ఇప్పడు చీప్ లిక్కర్ ను ఎవరు కూడా తీసుకోవడం లేదు. ఖరీదైన మద్యమే కావాలని ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఖరీదైన మద్యం సరఫరా చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం మార్గాలను అభ్యర్దులు కనుగొన్నారు. ఖరీదైన మద్యాన్ని నకీలీవి తయారీ చేసి వైన్ షాపు లతో పాటుగా ఎన్నికల్లో సరఫరా చేసిన ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠా గత కొన్ని నెలల నుంచి కొన్ని లక్షల లీటర్లు ఖరీదైన నకీలీ మద్యం ను విక్రయించింది.

నకీలీ మద్యంతో….

మొన్నటి అసెంబ్లీ , పార్లమెంట్ , పంచాయితీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో మద్యం ఏరులై పారింది. ఎక్కడా చీప్ లిక్కర్ ను ఇవ్వలేదు. అందరూ ఖరీదైన లిక్కర్ నే పంచారు. అయితే పెద్ద మొత్తంలో ఖరీదైన లిక్కర్ సరఫరా చేసిన వెనుకాల అసలు మతలబు వుంది. ఇప్పటి వరకు ఎవరికి అర్దం కాని విషయం బయట పడింది. నకీలీ మద్యం తయారీ చేసి మాఫియాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడంతో చాల విషయాలు బయట పడ్డాయి. గత కొన్ని నెలలుగా ఖరీదైన మద్యాన్ని తయారు చేసి వైన్ షాపులతో పాటుగా ఎన్నికల్లో పొటి చేస్తున్న అభ్యర్దులకు సరఫరా చేసినట్లుగా ముఠా పెర్కొంది. దీని వెనకాల హైదరాబాద్ కు చెందిన లాయక్ అలీ ప్రధాన నిందితుడని, అతడు పోలీసులు పరారీలో వున్నాడని అధికారులు వెల్లడించారు.

శివారు ప్రాంతాల్లో…..

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నకీలీ మద్యం విచ్చల విడిగా అమ్ముతున్నారు. ఖరీదైన మద్యమే ఎక్కువగా నకీలీ వి తయారీ చేసి విక్రయించారు. వెయ్యి నుంచి మూడు వేల రూపాయల విలువ చేసే మద్యం ఎక్కువగా నకీలీ తయారు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఖరీదైన మద్యాన్ని నకిలి తయారీ చేసి వైన్ షాపులకు సరఫరా చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన లయాక్ పరారీలో వున్నాడని ఎక్సెజ్ అధికారులు తెలిపారు. హైదరబాద్ శివారు ప్రాంతంలో నకీలీ మద్యం తయారు చేస్తున్నారు. అంత్యంత ఖరీదైన బ్రాండెండ్ లిక్కర్ ను ఈ ముఠా తయారీ చేస్తుంది. తయారీ చేసి మద్యాన్ని హైదరాబాద్ తో పాటుగా వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సరఫరా చేస్తుంది. యాద్రాది జిల్లా పొచంపల్లిలోని ఒక పాత బడిన గోదాంలో ఈ లిక్కర్ ను తయారీ చేస్తున్నారు. ఖరీదైన నకీలీ మద్యం తయారీ చేసి వైన్ షాపులకు టోకు గా విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల గల ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మద్ది అనిల్ రెడ్డి, మద్ది నరేందర్ రెడ్డి, మద్ది విక్రమ్ రెడ్డి, మద్ది లట్టు, బండారు నరేందర్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు లాయక్ అలీ ముద్దిరాజ్ లు పరారీలో వున్నారని అధికారులు వెల్లడించారు. .

Tags:    

Similar News