హైదరాబాద్ లోనే గాలి....??

Update: 2018-11-10 03:04 GMT

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని తన క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో గాలి జనార్థన్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. గాలి జనార్థన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లంచం ఇచ్చిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి గాలి జనార్థన్ రెడ్డికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఫలితం లేదు. మరోవైపు ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు.

లొంగిపోయేందుకు.....

ఈ నేపథ్యంలో గాలి మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని తెలుసుకున్న ఆయన స్నేహితులు లొంగిపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అంబిడెంట్ సంస్థను కేసుల నుంచి తప్పించేందుకు గాలి జనార్థన్ రెడ్డి దాదాపు 25 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆసంస్థ ప్రతినిధులను విచారించగా ఈ విషయం బయటకు పొక్కింది. బళ్లారికి చెందిన బీజేపీ నేత శ్రీరాములు సాయంతో గాలి త్వరలోనే కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్ననే గాలి తరుపున ముందస్తు బెయిల్ కోర్టులో దాఖలయింది.

Similar News