బ్రేకింగ్ : హుటాహుటిన విశాఖకు బయలుదేరిన జగన్

విశాఖపట్నంలో విషవాయువులు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు మూడు కిలోమీటర్ల [more]

Update: 2020-05-07 03:40 GMT

విశాఖపట్నంలో విషవాయువులు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు మూడు కిలోమీటర్ల మేర విస్తరించాయి. మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు చికిత్స అందిస్తున్నారు. దాదాపు ఇరవై మందికి కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సంఘటనపై సమీక్షిస్తున్నారు. పరిశ్రమకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కెమికల్ గ్యాస్ లీక్ అవ్వడంతోనే వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పరిశ్రమ యజమానిపై ప్రభుత్వం కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖకు బయలుదేరి వెళుతున్నారు. చాలా మంది ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

Tags:    

Similar News