వాటర్ బాటిల్ కోసం కాల్పులు.. జీటీ ఎక్స్ ప్రెస్ లో కలకలం

జీటీ ఎక్స్ ప్రెస్ లో లో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక స్వల్ప వివాదంతో పోలీసులు కాల్పులు [more]

Update: 2020-03-20 04:53 GMT

జీటీ ఎక్స్ ప్రెస్ లో లో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక స్వల్ప వివాదంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రైన్ క్యాంటీన్ నిర్వాహకులు సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ సునీల్ సింగ్ ను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై కి వెళ్తున్న జి టి ఎక్స్ప్రెస్ లో క్యాంటీన్ నిర్వాహకులకు, రైలు లో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి మధ్య వివాదం చోటు చేసుకుంది. చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. వాటర్ బాటిల్స్ వ్యవహారంలో క్యాంటీన్ నిర్వాహకులకు, కానిస్టేబుల్ కు మధ్య వివాదం జరిగింది . దీంతో అశోక్ బాబు అనే కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో సునీల్ కుమార్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన డోర్నకల్ – పాపాటపల్లి మధ్య జరిగింది.

Tags:    

Similar News