కత్తి మహేష్ మృతి

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కత్తి మహేష్ మృతి చెందారు. కత్తి మహేష్ [more]

Update: 2021-07-10 12:37 GMT

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కత్తి మహేష్ మృతి చెందారు. కత్తి మహేష్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనను వెంటనే చెన్నై ఆసుపత్రికి తరలించారు. కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కత్తి మహేష్ చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం పదిహేడు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసింది. కత్తి మహేష్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News