Etala : ఎన్ని ప్రలోభాలు పెట్టినా?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదవుతుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన తన భార్య జమునతో కలసి కమలాపూర్ లో ఓటు [more]

Update: 2021-10-30 05:01 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదవుతుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన తన భార్య జమునతో కలసి కమలాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ వేల కోట్లు హుజురాబాద్ లో ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. జీవోల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్నారు. హుజూరాబాద్ ఎన్నిక ఫలితం కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు.

ధర్మమే గెలుస్తుంది….

పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. పోలీసుల ఎస్కార్ట్ తో మద్యం, డబ్బులను తరలించారని, ఎన్నికల నిబంధలను తుంగలో తొక్కార్నారు. అయినా చివరకు ధర్మమే గెలుస్తుందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News