కొరియర్ ద్వారా డ్రగ్స్… కోట్లలో చెల్లింపులు

టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకందారులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి అయినట్లు గుర్తించింది. అమెరికా నుంచి ఎల్సీడీ, కొకైన్, [more]

Update: 2021-08-27 04:55 GMT

టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకందారులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి అయినట్లు గుర్తించింది. అమెరికా నుంచి ఎల్సీడీ, కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు, దీనికి సంబంధించి నగదు ఇక్కడి నుంచి బదిలీ అయినట్లు తేలింది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్ ద్వారా సమాచారం అందింది. ఒక్క గ్రాము కొకైన్ ధర పదివేలు కావడంతో కోట్లలో లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ ను కొరియర్ నుంచి తెప్పించుకున్నట్లు నిర్ధారణ అయింది. మూడు కొరియర్ కంపెనీలపై కూడా ఈడీ ఆరా తీస్తుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా, అమెరికా ద్వారా డ్రగ్స్ దిగుమతి అయినట్లు గుర్తించారు.

Tags:    

Similar News