డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై నేడు హైకోర్టులో?

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ అరెస్ట్ అంశంపై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. డాక్టర్ సుధాకర్ ను అమానుషంగా అరెస్ట్ చేశారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయిన [more]

Update: 2020-05-22 02:26 GMT

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ అరెస్ట్ అంశంపై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. డాక్టర్ సుధాకర్ ను అమానుషంగా అరెస్ట్ చేశారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయిన సంగతి తెలిసిందే. దీనిపై విశాఖ సెషన్స్ జడ్జిని డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. డాక్టర్ సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకుని హైకోర్టుకు సెషన్స్ జడ్జి నివేదిక అందించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా డాక్టర్ సుధాకర్ ను ఒక దళిత మంత్రి బుజ్జగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైద్యుడు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెబితే ఉద్యోగం తిరిగి ఇస్తామని రాయబారాలు నడుపుతున్నారని టీడీపీ పేర్కొంది.

Tags:    

Similar News