ప్రాణం ఖరీదు పది లక్షలు.. డీల్ అదే….

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో రోజుకో అంశం వెలుగు చూస్తోంది.ఈకేసులో అవంతి కుటుంబ సభ్యులు మొదట ఒక కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారని [more]

Update: 2020-09-30 03:07 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో రోజుకో అంశం వెలుగు చూస్తోంది.ఈకేసులో అవంతి కుటుంబ సభ్యులు మొదట ఒక కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారని లక్ష అడ్వాన్స్ తరువాత వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరో గ్యాంగ్ తో కలిసి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులు యుగంధర్, లక్ష్మారెడ్డిలను కోర్టు ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఇక ఈ కేసులో ఎన్ని ట్విస్ట్ లు ఎదురావుతాయో వేచి చూడాలి..

రెండు ముఠాలు…..

పరువు హత్యలో మరో కొత్త విషయం బయటపడింది. హేమంత్ ని హత్య చేసేందుకు అవంతి కుటుంబ సభ్యులు రెండు ముఠాలను కలిసినట్లు తెలిసింది. ఒక ముఠా హ్యాండ్ ఇవ్వడంతో మరో ముఠా సహకరించింది. ఒక ప్రాణం ఖరీదు పది లక్షలకు డీల్ కుదిరింది. వాస్తవానికి ఈఏడాది జూన్‌ 10న అవంతి, హేమంత్‌ల వివాహం కాగా, రెండు నెలలపాటు అవంతిని తమ వైపునకు తిప్పుకొనేందుకు కుటుంబ సభ్యులు యత్నించి విఫలమయ్యారు. హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించడం ద్వారా దంపతులను విడదీయాలని భావించారు. ఇందుకోసం ఒకట్రెండు నెలల కిందటే యుగంధర్‌రెడ్డి ఓ గ్యాంగ్‌ సభ్యుడిని సంప్రదించాడు. అందుకు10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సమాచారం ఇస్తే, కిడ్నాప్‌ చేద్దామంటూ ఆ వ్యక్తి చెప్పాడు. రెండు, మూడు సార్లు రెక్కీ నిర్వహించి ఫోన్‌ చేసినా ఇప్పుడొద్దులే అంటూ ఆ వ్యక్తి వాయిదా వేశాడు. ఆ తరవాత ఫోన్‌ ఆపేయడంతో బిచ్చూ యాదవ్‌ ముఠాతో ఒప్పందం చేసుకొని హత్య చేయించాడు.

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా…

ఈ కేసులో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్న తరువాత నేరుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిశారు. ఇరువురి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత అవంతి ఫ్యామిలీ మొత్తం మర్డర్ కి ప్లాన్ ల మీద ప్లాన్ లు వేశారు. ఈ కేసులో 25 మంది నిందితులు ఉన్నా 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ కేసు లోతుగా అధ్యయనం చేసేందుకు నిందితులను కస్టడీ కోరగా యుగంధర్, లక్ష్మారెడ్డిలను ఆరు రోజులు కస్టడీకి ఇస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక నేటి నుండి వారిని గచ్చిబౌలి పోలీసులు విచారణ చేయనున్నారు.

నేడు కస్టడీకి….

అంతే కాదు కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతామని, వీలైనంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీపీ తెలిపారు. అవంతి, హేమంత్ రక్షణ విషయంలో తమను ఎప్పుడు కొరలేదని ఒకవేళ కోరితే ఖచ్చితంగా ఇచ్చేవారమని అన్నారు.ఇదిలావుంటే హేమంత్ కుటుంబ సభ్యులను పోలీసులు మరోసారి పిలిచారు. డీసీపీ వెంకటేశ్వర్ రావు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే పరారీలో ఉన్న మిగతా 11 మంది కోసం గాలిస్తున్నారు. అయితే హేమంత్ కేసులో అవంతి కుటుంబ సభ్యులు రెండు ముఠాలనే కలిశారా ఇంకా ఎవరైనా పాత్ర ఉందా అని విషయం కస్టడీలో బయటపడనుంది.

Tags:    

Similar News