కరోనా ను వాడేసుకుంటున్న నేరగాళ్లు

కరోనా కాలంలో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినంత మొత్తంలో దోచుకుంటున్నారు. కరోనా కు సంబంధించి సేవలు అందిస్తున్నామని మోసాలకు పాల్పడుతున్నారు. టీకా తో పాటుగా కొవిడ్ [more]

Update: 2021-05-12 01:07 GMT

కరోనా కాలంలో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందినంత మొత్తంలో దోచుకుంటున్నారు. కరోనా కు సంబంధించి సేవలు అందిస్తున్నామని మోసాలకు పాల్పడుతున్నారు. టీకా తో పాటుగా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ కొత్త కొత్త పేర్లతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఆటలను అరికట్టేందుకు పోలీసులు నానా యాతన పడాల్సి వస్తుంది. కొవిన్‌, ఆరోగ్య సేతు వెబ్‌సైట్లు, యాప్‌లద్వారా స్లాట్లు లభించకపోవడంతో తమ యాప్‌ల ద్వారా నమోదు చేసుకోవాలంటూ వాట్సాప్‌ లింకులు పంపుతున్నారు. వీటిని క్లిక్‌ చేస్తే వ్యక్తిగత మెయిళ్లను హ్యాక్‌ చేయడంతోపాటు నెట్‌బ్యాంకింగ్‌ ఖాతాలు వారి నుంచి రూ.లక్షలు నగదు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సైబర్‌ నేరస్థులు మోసాలు ప్రారంభించారని కేంద్ర ప్రభుత్వం, నిఘా వర్గాలు సైబర్‌ దాడులపై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. . వీటికి అదనంగా ప్రముఖ వ్యక్తులు, కార్పొరేటు సంస్థలను లక్ష్యంగా చేసుకుని చైనా హ్యకర్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. . కొవిడ్‌ టీకాలు, నిర్ధరణ పరీక్షలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోర్టళ్లను మాత్రమే వినియోగించాలంటూ విస్తృతంగా ప్రచారం చేయాలంటూ సూచించాయి. వాట్సప్‌లలో వచ్చే వీడియోలు, సంభాషణలను స్నేహితులకు, బృందాలకు బదిలీ చేస్తున్నారు. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తించిన సైబర్‌ నేరస్థులు, హ్యాకర్లు మీ ఇంటికి సమీపంలోనే ఉచితంగా కొవిడ్‌ టీకాలు వేస్తున్నామంటూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల వివరాలను వాట్సప్‌లకు పంపుతున్నారు. మీ పేరు నమోదు చేసుకోండి అంటూ లింక్‌ను పంపుతున్నారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే వ్యక్తిగత సమాచారమంతా సైబర్‌ నేరస్థులకు పోతుంది. . దీనికి తోడు క్లిక్‌ చేసిన వ్యక్తి ఫోన్‌లో వాట్సప్‌ నంబర్లన్నింటికీ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. స్నేహితులు, సహచరులు, సహోద్యోగులు పంపించారన్న భావనతో మిగిలిన వాటిని క్లిక్‌ చేసి మోసపోతున్నారు.

Tags:    

Similar News