చేతి గ్లౌజ్ ల పేరుతో మోసం.. లక్షకు టోకరా

చేతి గ్లౌజ్ ల పేరుతో ఆన్ లైన్ లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చేతి గ్లౌజ్ లు సప్లై చేస్తామంటూ ఒక వ్యాపారవేత్తను మోసం చేశారు. [more]

Update: 2021-05-04 01:28 GMT

చేతి గ్లౌజ్ ల పేరుతో ఆన్ లైన్ లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చేతి గ్లౌజ్ లు సప్లై చేస్తామంటూ ఒక వ్యాపారవేత్తను మోసం చేశారు. మల్టీ నేషనల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కూడా చిక్కుకొని లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ లో చేతి గ్లౌజ్ ల కోసం ఆర్డర్ పెట్టి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. ఆన్ లైన్ బిజినెస్ డైరెక్టరీ నుండి వివరాలు పొందిన వ్యాపారవేత్త చేతి గ్లౌజ్ ల సరఫరాల కంపెనీ అని చెప్పుకునే ఓ వ్యక్తిని సంప్రదించాడు. సదరు మోసగాడు నమ్మేలా మాట్లాడి డీల్ కుదుర్చుకున్నాడు. బ్యాంకు వివరాలు ఇచ్చి లక్ష రూపాయలు జమ చేయాలని వ్యాపారవేత్తను కోరారు. అతన్ని నమ్మిన వ్యాపారవేత్త వెంటనే నగదును సైబర్ నేరగాడి ఖాతాల్లో జమచేశాడు. ఇంకేం ఉంది నగదు జమ కాగానే ఆ సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించని వ్యాపారవేత్త వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Tags:    

Similar News