రౌడీ హీరో పేరు చెప్పి… బుక్కయిపోయి

హీరో విజయ్ దేవరకొండ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అమ్మాయిల ఫాలోయింగ్ ను చూసి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు ఒక సైబర్ కేటుగాడు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ [more]

Update: 2020-03-07 02:37 GMT

హీరో విజయ్ దేవరకొండ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అమ్మాయిల ఫాలోయింగ్ ను చూసి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు ఒక సైబర్ కేటుగాడు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్ బుక్ లో ఒక అకౌంట్ తెరిచారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఇ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. కొంతమందిని సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు. చివరకు ఈ విషయం విజయ్ దేవరకొండ తెలిసి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయి కుమార్ ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బాన్సు వాడకు చెందిన….

సోషల్ మీడియాలో సినీ హీరో విజయ్ దేవరకొండ పేరుతో తన ఫోన్ నెంబర్ పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ దేవరకొండ ను కలవాలంటే ఈ నెంబర్ తో కాంటాక్ట్ అవ్వాలని సోషల్ మీడియా లో పోస్టింగ్ లు పెడుతూ, అమ్మాయిలతో చాట్ చేస్తున్నట్లు ఈ నెల 3 న విజయ్ దేవరకొండ మేనేజర్ గోవింద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వాడిన ఫేస్ బుక్ ఐడి , మొబైల్ నెంబర్ ఆధారంగా అతన్ని బాన్సువాడ , మిర్జాపూర్ గ్రామంలో సాయికిరణ్ గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని హైద్రాబాద్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News