తెలంగాణలో హై అలెర్ట్.. నేటి నుంచి కొత్త ఆసుపత్రి

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. [more]

Update: 2020-04-20 02:22 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకూ పొడిగించారు. ఈరోజు గచ్చి బౌలి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. కరోనా చికిత్స కోసం గచ్చిబౌలిలో తాత్కాలికంగా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 1500 పడకల సామర్థ్యం కల్గిన ఈ ఆసుపత్రిని నేడు ప్రారంభించనున్నారు. పరిస్థితి చేయి దాటితే తప్ప ప్రయివేటు ఆసుపత్రులకు అనుమతివ్వబోమని కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News