వ్యాపార‌వేత్త‌పై కాంగ్రెస్ నేత దాడి

పార్కింగ్ ద‌గ్గ‌ర నెల‌కొన్న స్వ‌ల్ప వివాదం వ్యాపార‌వేత్త‌పై దాడికి కార‌ణ‌మైంది. కాంగ్రెస్ నాయ‌కుడు, ఇటీవ‌ల హుజురాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పాడి కౌశీక్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని [more]

Update: 2019-02-04 14:34 GMT

పార్కింగ్ ద‌గ్గ‌ర నెల‌కొన్న స్వ‌ల్ప వివాదం వ్యాపార‌వేత్త‌పై దాడికి కార‌ణ‌మైంది. కాంగ్రెస్ నాయ‌కుడు, ఇటీవ‌ల హుజురాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పాడి కౌశీక్ రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని గుణ వ‌జ్రాల షోరూం వ‌ద్ద కారు పార్కింగ్ చేసి వేరే షోరూంకి వెళ్లారు. ఈ షోరూం సినీ న‌టుడు రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు గుణ‌శేఖ‌ర్‌ది. అయితే, త‌మ షోరూం వ‌ద్ద కారు ఎందుకు పార్కు చేశార‌ని గుణ‌శేఖ‌ర్‌… కౌశీక్ ను ప్ర‌శ్నించారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. అయితే, కౌశీక్‌రెడ్డి త‌న‌పై తీవ్రంగా దాడి చేశార‌ని గుణ‌శేఖ‌ర్ ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న వ‌దిన జీవితారాజ‌శేఖ‌ర్ తో క‌లిసి వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కౌశీక్ రెడ్డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జీవిత కోరుతున్నారు.

Tags:    

Similar News