సోనూ సూద్ పేరిట డబ్బు వసూలు

నటుడు సోను సూద్ పేరుతో రోజుకొక సంస్థ పుట్టుకొస్తుంది. సోను సూద్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. అంతేకాకుండా సోనూసూద్ [more]

Update: 2021-03-09 01:36 GMT

నటుడు సోను సూద్ పేరుతో రోజుకొక సంస్థ పుట్టుకొస్తుంది. సోను సూద్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. అంతేకాకుండా సోనూసూద్ డబ్బులు ఇస్తాడని చెప్పి టాక్స్ ల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తాజాగా సైదరాబాద్ కేంద్రంగా సోనుసూద్ పౌండేషన్ పేరుతో భారీ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. సోను సూద్ ఫౌండేషన్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోను సూద్ పేరుతోటి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోనుసూద్ పేరుతోటి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోను సూద్ ఫౌండేషన్ పెద్ద మొత్తంలో సహాయం చేస్తుందని అంటూ ప్రచారం చేశారు. దీనిని నమ్మిన వాళ్లు చాలామంది సహాయం కోసం అర్జీలు పెట్టుకున్నారు . అయితే హైదరాబద్ కు చెందిన ఒక వ్యక్తి తనకు సహాయం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. సోనూసూద్ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై వచ్చింది. ఇందు కొరకు కొంత చెల్లించాలంటూ సదరు వ్యక్తికి రిప్లై ఇచ్చారు. సోను సూద్ పెరు తో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. డబ్బులు సహాయం అందక పోవడంతో తాను మోసపోయానని గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News