ల్యాండ్ పూలింగ్ పై సీఐడీ

రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారిపై సీఐడి విచారణ ప్రారంభించింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి [more]

Update: 2020-01-23 06:05 GMT

రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారిపై సీఐడి విచారణ ప్రారంభించింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన 796 మంది తెల్ల రేషన్ కార్డుల దారులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఎకరం మూడు కోట్లకు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో తేలింది. తాడికొడ, తుళ్లూరు, మంగళగిరిలో ఈ భూములు కొనుగోలు చేసినట్లు తేలింది. మొత్తం 300 కోట్ల రూపాయలతో తెల్ల రేషన్ కార్డు దారులు ఈ భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో గుర్తించింది. ఈ విచారణ కోసం మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News