ఏకంగా చీఫ్ సెక్రటరీ సంతకాన్నే ఫోర్జరీ చేసి.....?

Update: 2018-07-10 03:38 GMT

తెలంగాణ సీఎస్ సంతకంను ఫోర్జరీ చేసిన పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చేప్పి మోసం చేయడమే కాకుండా ఏకంగా సచివాలయంలో అపాయింట్ మెంట్ లెటర్స్ తీసుకుని వచ్చిన మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్ పల్లికి చెందిన ప్రేమ్ సాగర్ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పేరు చెప్పి రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే ప్రేమ్ సాగర్ చేసిన మోసం చివరకు అతని మెడకు చుట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అందరి దగ్గర లక్షల రూపాయలను వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్న వారందరికి కూడా అపాయింట్ లెటర్స్ కూడా ఇచ్చాడు.

సచివాలయానికి తీసుకువచ్చి......

అందరినీ ఒకే రోజున ఉద్యోగంలో చేర్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. రెండు రోజుల క్రితం ఎవరికైతే అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చాడో అందరినితీసుకుని ఏకంగా సచివాలయానికి వచ్చాడు... అక్కడి వచ్చిన తరువాత సిఎస్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న సెక్యూరిటి సిబ్బందికి అనుమానం వచ్చి వివరాలు అడిగారు. అయితే తాను సీఎస్ ను కలవాలని చెప్పాడు. అప్పటికే అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే ప్రేమ్ సాగర్ ను తనీఖీ చేయగా అతని దగ్గర నకీలీ ఉద్యోగ పత్రాలు లభించాయి. వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పోలీసులు విచారణ చేయగా. నకీలీ ఉద్యోగ పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమేనని ఒప్పకున్నాడు. దీంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. నిరుద్యోగుల నుంచి దాదాపుగా ఉద్యోగాల పేరు చెప్పి రెండు కోట్లు వసూలు చేసినట్లుగా ప్రేమ్ సాగర్ ఒప్పుకున్నాడు.

Similar News