అంతటా మార్పులు.. చేర్పులు….!!

కేంద్ర మంత్రివర్గంలో ఎవరుండాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు చర్చిస్తున్నారు. కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకునే అవకాశముంది. అరుణ్ జైట్లీ స్థానంలో [more]

Update: 2019-05-29 11:36 GMT

కేంద్ర మంత్రివర్గంలో ఎవరుండాలన్న దానిపై ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు చర్చిస్తున్నారు. కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి ఇద్దరు మహిళలను తీసుకునే అవకాశముంది. అరుణ్ జైట్లీ స్థానంలో అమిత్ షాను తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షా మిత్ర పక్షాలతో కూడా చర్చలు జరుపుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ తో అమిత్ షా 40 నిమిషాల పాటు చర్చించారు. జేడీయూ మిత్రపక్షంగా ఉన్నా గత ప్రభుత్వంలో చేరలేదు. ఇప్పుడు చేరతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మంత్రి వర్గాన్ని 60 నుంచి 32 కు కుదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడిగా కూడా…..

రెండోసారి అధికారంలోకి రావడంతో భారతీయ జనతా పార్టీలోనూ, పెద్దయెత్తున మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు జేపీ నడ్డాను నియమించారు. అమిత్ షా కేంద్రమంత్రివర్గంలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే అరుణ‌ జైట్లీ ఆరోగ్య కారణాల రీత్యా తనను మంత్రివర్గంలోకి తీసుకోవద్దని ప్రధానిని కోరారు. భారతీయ జనతా పార్టీలో రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాల్సి ఉంది. కొంతకాలం క్రితమే అమిత్ షా పదవీ కాలం పూర్తయినప్పటకీ లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఆయనను కొనసాగించాలని అప్పట్లో నిర్ణయించారు.

Tags:    

Similar News