ఇంతటి దారుణం నేనెప్పుడూ చూడలేదు

కార్యకర్తలను తన వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తణుకులో తన పర్యటన ఉందని పదిరోజుల ముందే పోలీసులకు సమాచారమిచ్చినా సెక్షన్ 30ని [more]

Update: 2019-11-19 08:08 GMT

కార్యకర్తలను తన వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తణుకులో తన పర్యటన ఉందని పదిరోజుల ముందే పోలీసులకు సమాచారమిచ్చినా సెక్షన్ 30ని అమల్లోకి తెచ్చారన్నారు. కార్కకర్తలు తన వద్దకు రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి దారుణ పరిస్థితును తాను చూడలేదన్నారు. చింతమనేని ప్రభాకర్ పై 18 తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేశానన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.

Tags:    

Similar News