బ్రేకింగ్ : జగన్ కు బాబు సవాల్ .. తేల్చుకుందాం రా

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఇందుకు జగన్ [more]

Update: 2020-08-03 11:57 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఇందుకు జగన్ కు 48 గంటల సమయం ఇచ్చారు. అసెంబ్లీని రద్దు చేసి ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దామని చంద్రబాబు జగన్ కు సవాల్ చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితం జూమ్ యాప్ ద్వారా విజయవాడ మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము రాజీనామాలు చేయడం చిటికెలో పని అని చంద్రబాబు అన్నారు. అమరావతి అంశంపై నమ్మకం మీకు ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. మేం విసురుతున్న సవాల్ ను స్వీకరిస్తారా? లేదా? అన్నది తేల్చి చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిని మారుస్తామని చెప్పకుండా ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం నిమిషం పనని, అసెంబ్లీనే రద్దు చేస్తే ఎన్నికలు వాటంతట అవే వస్తాయని చంద్రబాబు అన్నారు. వీళ్లకు ఓట్లు వేశారని రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News