కేంద్రం అంత చేస్తున్నా.. జగన్ మాత్రం?

కరోనా సమయంలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర [more]

Update: 2020-07-02 07:52 GMT

కరోనా సమయంలో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబానికి ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 8,500 కోట్లు విడుదలయ్యాయని కేంద్ర మంత్రులు చెబుతున్నారన్నారు. అలాగే నవంబరు వరకూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించడం ప్రశంసనీయమని చంద్రబాబు అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులను సరిగా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి మీడియాతో మాట్లాడారు.

అన్నింటిలో అవినీతి……

108, 104 వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని చంద్రబాబు అన్నారు. విజయసాయిరెడ్డికి బర్త్ డే గిఫ్ట్ గా జగన్ ఈ వాహనాలను ఆయన అల్లుడికి అప్పగించారన్నారు. ఇసుక, ఇళ్ల స్థలాలు, మద్యం, సరస్వతి వంటి విషయాల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్నారు. ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెడతారా? మీకెవరిచ్చారు ఆ అధికారం అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏడాదిలో 800 పైగా టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    

Similar News