ఒక్క ఛాన్స్ అడిగింది అందుకేనా జగన్?

గడచిన ఏడాది రాజకీయంగా అనేక కష్టాలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా గత ఏడాది అనేక కష్టాలు చూశామన్నారు. పార్టీ కష్టకాలంలో [more]

Update: 2020-05-27 07:31 GMT

గడచిన ఏడాది రాజకీయంగా అనేక కష్టాలు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా గత ఏడాది అనేక కష్టాలు చూశామన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్న కార్యకర్తలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి బలహీనవర్గాలే వెన్నుముక అని చంద్రబాబు చెప్పారు. అన్ని కులాల కోసం ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధి చేస్తూనే సంపదను సృష్టించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులన్నింటిని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే వ్యవస్థలను ధ్వంసం చేశారన్నారు.

పోతిరెడ్డి పాడుపై….

మొన్నటి వరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి తిరిగి పోతిరెడ్డి పాడు పై 203 జీవో తెచ్చారన్నారు. పోతిరెడ్డి పాడును ప్రారంభించింది ఎన్టీరామారావు హయాంలోనేనని చెప్పారు. రాయలసీమకు గోదావరి జలాలను తరలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ పెట్టిన అనేక పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్నీ వెనక్కు పోయాయని చెప్పారు. కరోనా సమయంలోనూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు.

కరోనాను మేమైతే కట్టడి చేసే వాళ్లం….

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కరోనాను కట్టడి చేసేవాళ్లమని చెప్పారు. కరోనా వ్యాప్తికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వసం చేయడం కోసమే ఒక్క ఛాన్స్ అడిగారా? అని చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు. అన్ని చోట్ల అవినీతి రాజ్యమేలుతుందన్నారు. మద్యం, ఇసుక, గనులు, భూముల్లో అంతటా అవినీతి జరిగిందన్నారు. ఎక్కడ చూసినా వైసీపీ నేతలు బలవంతపు వసూళ్లు చేస్తున్నారన్నారు. భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. తప్పు చేయడం.. కప్పి పుచ్చుకోవడానికి ఎదురుదాడులు చేయడం జగన్ కే చెల్లుతుందన్నారు.

Tags:    

Similar News