చంద్రబాబు పెద్ద మనసు

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖల ద్వారా, వీడియో సందేశాల ద్వారా [more]

Update: 2020-03-25 02:11 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖల ద్వారా, వీడియో సందేశాల ద్వారా కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు. దీంతో పాటు కరోనా కట్టడికి, పేదలకు సాయం చేసేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయనిధికి పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక నెల వేతనాన్ని కరోనా వ్యాధి నిరోధానికి కేటాయించారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించారు. టీడీపీ నేతలు కూడా కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News