జగన్ ఆటలు సాగనివ్వను

బీసీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామని ప్రచారం చేసుకుని జగన్ తర్వాత తన అనుచరుల చేత కేసులు [more]

Update: 2020-03-03 12:27 GMT

బీసీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామని ప్రచారం చేసుకుని జగన్ తర్వాత తన అనుచరుల చేత కేసులు వేయించి చెత్త రాజకీయాలను చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. బీసీలకు అన్ని రకాలు న్యాయం చేసింది టీడీపీ మాత్రమే అన్నారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించింది కూడా టీడీపీయేనని చెప్పారు. 11 బీసీ ఫెడరేషన్లకు నిధులు ఇవ్వకుండా వాటిని ఇతర పథకాలకు మళ్లించి వైసీప ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. 1987లో ఇచ్చిన రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం కాపాడలేకపోయిందన్నారు. రిజర్వేషన్లను తగ్గించే అధికారం జగన్ కు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై తాము పోరాడతామని చెప్పారు. బీసీల పట్ల వైసీపీ సర్కార్ వివక్ష చూపుతుందన్నారు. శాసనమండలి రద్దు చేయడానికి మాత్రం ప్రధాని మోదీ, అమిత్ షా చుట్టూ జగన్ తిరుగుతారని, బీసీల విషయంలో మాత్రం పట్టించుకోరని చంద్రబాబు విమర్శించారు.

చరిత్రలో ఇప్పటి వరకూ…..

బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారన్నారు. చరిత్రలో జగన్ లాగా ఇప్పటి వరకూ ఎవరూ ద్రోహం చేయలేదన్నారు. బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమేనని చెప్పారు. వైసీపీ మండల పార్టీ కన్వీనర్ తోనే హైకోర్టులో కేసు వేయించారన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అమరావతిని నాశనం చేశారని, పోలవరాన్ని పక్కన పెట్టారన్నారు. ఈ ప్రభుత్వం ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి డబ్బులు పంచితే చర్యలు తీసుకుంటాననడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఆటలను సాగినవ్వనని, అందరితో కలసి పోరాడతానని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News