కరోనా విషయంలో అట్టర్ ప్లాప్

తాము నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాము 23 ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. సీమకు నీరందించామని చెప్పారు. వేలాది [more]

Update: 2020-08-10 12:24 GMT

తాము నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాము 23 ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. సీమకు నీరందించామని చెప్పారు. వేలాది కోట్ల రూపాయలను వెచ్చించామని చంద్రబాబు తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధిని సాధించామని చెప్పారు. 13 జిల్లాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తాము కృషి చేశామని చెప్పారు. 13 నెలల్లో వైసీీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. నిజమైన అభివృద్ధి ఏందో ప్రజలు తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఇరిగేషన్ కు మూడు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అమరావతి చుట్టూ 139 ప్రాజెక్టులు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. కరోనా విషయంలోనూ ప్రభుత్వం తప్పుడు విధానాలను అవలంబించిందన్నారు . తాను చెప్పిప్పడు విని ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవారు కారన్నారు. తాను చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దృష్టి అంతా ప్రతిపక్షాలను అణిచివేయడం మీదనే ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇబ్బంది అవుతుందన్నారు.

Tags:    

Similar News