ఈసీపై బాబు మరోసారి సీరియస్…!!

దేశంలోనే సీనియర్ నేతగా, పాతికేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశాను కానీ ఇటువంటి ఎన్నికల కమిషన్ ను చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. [more]

Update: 2019-05-17 12:50 GMT

దేశంలోనే సీనియర్ నేతగా, పాతికేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో ఎన్నికల కమిషన్లను చూశాను కానీ ఇటువంటి ఎన్నికల కమిషన్ ను చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రీపోలింగ్ వ్యవహారంతో పాటు ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై 10 పేజీల లేఖను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సంఘం నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని, నియమాలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. 25 రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో 5 బూత్ లలో రీపోలింగ్ కు ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఎన్నికల సంఘం సీఈఓకు నిబంధనలు తెలుసా అని, చదువుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ తమ ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తన పోరాటం ఎన్నికల సంఘంపై కాదని, ప్రజాస్వామ్యం కోసమే తన పోరాటమన్నారు.

Tags:    

Similar News