ఎన్నికల సంఘం తామాషాలు ఆడుతోంది..!

50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను కౌంటింగ్ జరపాలని తాము అడుగుతుంటే ఎన్నికల సంఘం లాజిక్ లేకుండా మాట్లాడుతోందని, తమాషాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీవీప్యాట్ల [more]

Update: 2019-05-01 08:46 GMT

50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను కౌంటింగ్ జరపాలని తాము అడుగుతుంటే ఎన్నికల సంఘం లాజిక్ లేకుండా మాట్లాడుతోందని, తమాషాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కపెట్టడానికి వారం రోజులు పడుతుందని ఈసీ తప్పుగా చెబుతోందన్నారు. పదేళ్లుగా తాను ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని, తర్వాత వీవీప్యాట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఒడిశాలో తుఫాను కారణంగా ఎన్నికల కోడ్ ను ఈసీ ఎత్తివేసిందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల కోడ్ తీసేయాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఈసీకి ఎలా ఉందో ప్రజలకు సేవ చేయాడానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తమ ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉందన్నారు.

ఎన్నికల సంఘానిది శాడిజమా..?

ఓ వైపు తుఫాను వచ్చి ప్రజలు అవస్థలు పడుతుంటే ఈసీకి ఆనందమా అని ప్రశ్నించారు. ఇదేమి శాడిజం అని అడిగారు. ఈసీకి పెత్తనం కావాలని అని ప్రశ్నించారు. ప్రధాని క్యాబినెట్ మీటింగులు పెట్టుకోవచ్చు కానీ తామెందుకు పెట్టుకోవద్దు అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రధాని అనేకసార్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రధాని చాలా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారని అన్నారు. ప్రధానమంత్రి స్థాయిని నరేంద్ర మోడీ దిగజారుస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత తాము ఎవరు ప్రధాని అవ్వాలనేది నిర్ణయించుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇంటర్ ఫలితాలపై అధికారులతో రివ్యూ చేశారని, అయినా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తిరుమల బంగారం గురించి సీఎస్ స్పందించాల్సిన అవసరం ఏముందని, అసలు ఆయనకు సంబంధం ఏముందని అడిగారు.

Tags:    

Similar News