పరిపూర్ణానంద స్వామిపై పోలీస్ కేసు

Update: 2018-07-10 07:56 GMT

ప్రతి మతానికీ ఉనికి ఉంటుందని దానిని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని పరిపూర్ణనంద స్వామి పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తులు హిందు ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అలాంటి వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండో రోజు పరిపూర్ణనంద స్వామిని పోలిసులు హౌజ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా హౌజ్ అరెస్ట్ లోనే పరిపూర్ణ స్వామి మాట్లాడిన వీడియోను మీడియాకు రిలిజ్ చేశారు. తనకు హిందూ ధర్మాగ్రహా యాత్రను నిర్వహించేలా పోలిసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోబావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న వ్యక్తులపై ప్రభుత్వం, పోలిసుల తీసుకున్న చర్యలు శూన్యమని పరిపూర్ణానంద మండిపడ్డారు. మరో వైపు స్వామి తో పాటు 15 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

Similar News