తప్పు చేశాను.. శిక్ష అనుభవించాను: బుట్టా రేణుక

బీసీ మహిళ అయిన తనను గుర్తించి జగన్ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే తాను టీడీపీలో చేరి తప్పు చేశానని.. అందుకు శిక్ష కూడా అనుభవించానని కర్నూలు ఎంపీ [more]

Update: 2019-03-16 13:15 GMT

బీసీ మహిళ అయిన తనను గుర్తించి జగన్ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే తాను టీడీపీలో చేరి తప్పు చేశానని.. అందుకు శిక్ష కూడా అనుభవించానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వాపోయారు. శనివారం ఆమె తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వైసీపీలో ఉన్న పారదర్శకత, స్పష్టత తెలుగుదేశం పార్టీలో లేదని, టీడీపీలో కేవలం మభ్యపెట్టడం, మానసికంగా మనుషులను వేధించడం మాత్రమే ఉంటుందన్నారు. ఐదేళ్లలో వైసీపీ, టీడీపీ మధ్య ఉన్న తేడాను తాను తెలుసుకున్నానని అన్నారు. టీడీపీలో చేరి తప్పు చేసినందున గుణపాఠం నేర్చుకున్నానని అన్నారు. మనకు ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉండాలని అందరికీ చెబుతున్నానని అన్నారు. బీసీ పార్టీ అనే తెలుగుదేశం పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు ఉన్న కర్నూలు ఎంపీ, మంగళగిరి ఎమ్మెల్యే సీట్లను తీసేసి ఓసీలకు ఇవ్వడం బీసీలకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు.

పోటీ చేయను…

మాటలకు, చేతలకు తేడాను తెలుసుకున్నానని బుట్టా రేణుక పేర్కొన్నారు. తనకు మళ్లీ స్వంత ఇంటికి వచ్చినంత సంతోషం ఉందన్నారు. ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, ఇక పార్టీని గెలిపించుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జగన్ తిరిగి తనను చేర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదనే బాధ లేదని అని, కోట్ల టీడీపీలో చేరేటప్పుడు కనీసం తనకు చెప్పలేదన్నారు. టీడీపీలో తనను మానసికంగా హింసించారన్నారు. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష ఉండాలని, ఆ శిక్ష నేను అనుభవించానన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు.

Tags:    

Similar News