సంక్షేమమే మా ప్రాధాన్యం

శాసనసభలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కోరోనా తో [more]

Update: 2020-06-16 08:10 GMT

శాసనసభలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కోరోనా తో ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడినా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ 2,24,789 కోట్లతో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూలధనం వ్యయం అంచనా 44,480 కోట్లుగా బడ్జెట్ లో చూపించారు. రెవెన్యూ వ్యయం అంచనా 1,80 లక్షల కోట్లుగా చూపించారు. కరోనా సమయంలోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని చెప్పారు.

పథకాలకు.. సామాజిక వర్గాలకు….

ఈ బడ్టెట్ లో అభివృద్ధి పథకాలకు 84,190,07 కోట్లను కేటాయించారు. బీసీల అభివృద్ధికి 23,351 కోట్లు కేటాయింపులు చేశఆరు. వైఎస్ఆర్ గృహవసతికి మూడు వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. రేషన్ బియ్యానికి మూడు వేల కోట్లను కేటాయించారు. ఎస్టీల అభివృద్ధి కోసం 5,100 కోట్లను కేటాయించినట్లు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. అమ్మఒడి కోసం ఆరువేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ పెన్షన్ కు ఆరువేల కోట్లను కేటాయించారు. వైఎస్సార్ నేతన్న హస్తం పథకానికి రెండువందల కోట్లు కేటయాాంచారు. వ్యవసాయానికి 11 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసాకు 1100 కోట్లు కేటాయించామన్నారు. జగనన్న వసతి దీవెనకు రెండువేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి మూడు వేల కోట్లు కేటాయించామని చెప్పారు. వడ్డీ లేని రుణాల కోసం 1100 కోట్లు కేటాయించారు. బీసీలకు గతంలో పోలిస్తే 68.8 శాతం అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. బీసీల అభివృద్ధికోసం 25,331 కోట్లను కేటాయించినట్లు బుగ్గన తెలిపారు. మైనారిటీలకు రెండువేల కోట్లను కేటాయించామని తెలిపారు.

Tags:    

Similar News