అందుకే రద్దు పై ఆలోచిస్తున్నాం

మూడు రాజధానుల విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసనసభలో చేసిన చట్టాన్ని మండలిలో ఎలా తిరస్కరిస్తారని బొత్స ప్రశ్నించారు. [more]

Update: 2020-01-23 08:13 GMT

మూడు రాజధానుల విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగేది లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసనసభలో చేసిన చట్టాన్ని మండలిలో ఎలా తిరస్కరిస్తారని బొత్స ప్రశ్నించారు. మండలి ఛైర్మన్ అనైతికంగా ప్రవర్తించారన్నారు. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలను సృష్టించాలనుకుంటోందన్నారు. ఎన్ని రాక్షస ఆలోచనలను చేసినా తమ విధానం మారబోదని బొత్స తెలిపారు. యనమల అనకూడని మాటలు అంటున్నారని బొత్స ఆవేదన చెందారు. సూచనలను మాత్రమే చేయాల్సిన శాసనమండలి చట్టాలను ఎలా అడ్డుకుంటుందన్నారు. నిన్న శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. అందుకే శాసనమండలి రద్దు ఆలోచన చేయాల్సి వస్తుందన్నారు. తొత్తుల్ని తీసుకొచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టా రన్నారు. నిబంధనలను పాటించాలని సభలో సగం మంది చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారన్నారు. ఇలాంటి వ్యవస్థ ఉండాలా? లేదా? అన్న చర్చ ఇప్పుడు మొదలయిందన్నారు.

Tags:    

Similar News