వారి కంటే వేశ్యలే నయం...

Update: 2018-06-06 10:22 GMT

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు వెన్నెతో పెట్టిన విద్య. ఆ పార్టీ నేతలు తరచూ ఏవో వ్యాఖ్యలు చేస్తూ పార్టీ పరువును దిగజారుస్తుంటారు. ప్రజల ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమవుతారు. ఇప్పుడే ఇదే కోవలో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మల్యే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలు నయం. వేశ్యలు డబ్బులు తీసుకుని పని చేస్తారు, స్టేజీపై డ్యాన్స్ చెస్తారు. కానీ, ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుని కూడా పనిచేయరు, పని పూర్తవుతుందని గ్యారెంటీ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యల పట్ల వివాదం చెలరేగుతోంది.

ఇదేం కొత్త కాదు...

బైరియా శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమికి యోగీ ప్రభుత్వంలోని మంత్రులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు కూడా అత్యాచారాలకు తల్లిదండ్రుల పెంపకం, మొబైల్ ఫోన్లే కారణమని, ఎవరూ ముగ్గురు పిల్లల తల్లిని అత్యాచారం చేయరని చిల్లర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని సూర్ఫనకగా అభివర్ణించారు. బెంగాల్ కూడా జమ్మూ కశ్మీర్ లా మారిపోతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ‘మనము తప్పులు చేసి, మీడియాకు మసాలా ఇవ్వద్దు’ అని గత నెల ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి చెప్పిన హితవును సురేంద్ర సింగ్ పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Similar News