తప్పు చేసి ఎలిమినేట్ అయ్యారు

ఎప్పటిలాగే బిగ్ బాస్ 3 లీకుల పర్వం ఈ వారమూ కొనసాగింది. ఆ లీకులతోనే ఈ వారం నామినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. మొదటినుండి [more]

Update: 2019-10-19 14:18 GMT

ఎప్పటిలాగే బిగ్ బాస్ 3 లీకుల పర్వం ఈ వారమూ కొనసాగింది. ఆ లీకులతోనే ఈ వారం నామినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. మొదటినుండి ఎలిమినేషన్ లోకి రాకుండా జాగ్రత్తపడుతున్న జ్యోతి ప్లాన్ ఇక్కడ పక్కాగా వర్క్ అవుట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3 లో మిగిలిన మూడు వారాల్లో ఉన్న 7 గురు కంటెస్టెంట్స్ లో ఈ వారం అందరు సభ్యులు నామినేషన్ కి వెళ్లారు. కారణం శివ జ్యోతి . తనకు కాకుండా వరుణ్ సందేశ్ వితికకు టాప్ 3 ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చెయ్యడం, నాలుగో నెంబర్ నుండి ఎలిమినేట్ అయ్యేవాళ్ళలో వితికాతో తాను ఉంటే వితిక ఎలిమినేట్ అయి తాను సేవ్ అవుదామనుకుంటే… వరుణ్ భార్య వితిక ఈ వారం గనక నామినేషన్ కి వెళితే ఎలాగూ ఎలిమినేట్ అవుతుందని భావించి కేవలం వితికాని సేవ్ చెయ్యడనికి టాప్ 3 పొజిషన్ ఇచ్చాడు.

శివజ్యోతి ప్లాన్ …..

కానీ తాను ఎలిమినేషన్స్ లో ఉండి టాప్ 3 లో వితిక ఉంటే… తాను ఈవారం ఎలిమినేట్ అవడం గ్యారెంటీ గనక వరుణ్ తో ఛాలెంజ్ చేసి లొల్లి పెట్టుకుని మరీ ఈ వారం అందరిని నామినేషన్ లోకి పడేసింది శివజ్యోతి. అలా అయితే వితిక ఈ వారం ఎలిమినేట్ అవుతుంది తాను సేఫ్ అవుతుందని జ్యోతి అనుకుంది. జ్యోతి అనుకున్నట్లుగా వితిక ఈ వారం ఎలిమిలేషన్ తో బయటికి వచ్చేసింది. వీక్ కంటెస్టెంట్ గా ఉన్న వితిక తన తెలివితేటలతో ఈ 13 వారాలు నెట్టుకొచ్చింది. మొదట్లో వరుణ్ వితికాను పట్టించుకోకపోయినా.. చివరిలో వితికాను కాపాడానికి ట్రై చేసి మరీ ఫెయిలయ్యాడు. అయినా వరుణ్ వితికాని కాపాడలేకపోయాడు.

Tags:    

Similar News