పోలీసుల అదుపులో బండ్ల గణేష్

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ ను బంజాాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన [more]

Update: 2019-10-23 14:06 GMT

నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ ను బంజాాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రావలసిన సొమ్మును తిరిగి చెల్లించమని పీవీపీకి అదిగితే బండ్ల గణేష్ తన అనుచరులతో కలసి బెదిరించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 448, 506, రెడ్‌విత్‌ 34 కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Tags:    

Similar News