Badvel : బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు

బద్వేలు ఉప ఎన్నిక ప్రారంభమయింది. అయితే బీజేపీ అభ్యర్థి ఏజెంట్లుగా టీడీపీ నేతలు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. బద్వేలు ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అయితే ఇక్కడ [more]

Update: 2021-10-30 03:31 GMT

బద్వేలు ఉప ఎన్నిక ప్రారంభమయింది. అయితే బీజేపీ అభ్యర్థి ఏజెంట్లుగా టీడీపీ నేతలు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. బద్వేలు ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అయితే ఇక్కడ బీజేపీకి తగిన బలం లేకపోవడంతో ఏజెంట్లుగా టీడీపీ వారిని నియమించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక చోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తుండటాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు…..

ఎన్నికకు దూరంగా ఉంటామని చెప్పిన టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు బద్వేలు ఉప ఎన్నికను ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News