బ్రేకింగ్: అయోధ్య వివాదంపై సుప్రీం కీలక ఆదేశాలు

అయోధ్య వివాదాన్ని పరిష్కరించే దిశగా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీం అనుమతించింది. ఇందుకు గానూ మధ్యవర్తులుగా రిటైర్డ్ [more]

Update: 2019-03-08 06:39 GMT

అయోధ్య వివాదాన్ని పరిష్కరించే దిశగా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీం అనుమతించింది. ఇందుకు గానూ మధ్యవర్తులుగా రిటైర్డ్ జడ్జి ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచుతో ప్యానెల్ ఏర్పాటు చేసింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్ లో జరపాలని, ఈ విచారణను గోప్యంగా ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఈ వివాదాన్ని పరిష్కరిస్తే బాగుంటుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News