జగన్ కేసులో ఏపీ సర్కార్ కు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో [more]

Update: 2019-01-19 10:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసు ఎన్ఐఏ పరిధిలోనే విచారణ జరగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రభుత్వ అంశాల్లో జోక్యం చేసుకుంటుందని, ఉగ్రవాదులు, రెండు రాష్ట్రాల మధ్య జరిగిన తీవ్రమైన కేసులను విచారించే ఎన్ఐఏ ను సాధారణ కేసులో ఎలా దర్యాప్తునకు ఆదేశిస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై కేంద్రం పెత్తనమేంటని కూడానిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏ విచారణ నుంచి తప్పించాలన్న పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News