ఈ వాచ్ యాప్ పై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించిన ఈ వాచ్ యాప్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే లంచ్ [more]

Update: 2021-02-03 05:44 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రూపొందించిన ఈ వాచ్ యాప్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే లంచ్ మోహన్ పిటీషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై రేపు విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఈ వాచ్ యాప్ ను రూపొందించింది. అయితే ఇది ప్రయివేటు యాప్ అని ప్రభుత్వం పేర్కొంటుంది. టీడీపీ కార్యాలయంలో యాప్ తయారయిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై హైకోర్టులో రేపు విచారణకు రానుంది.

Tags:    

Similar News