దసరాకు కూడా బస్సులు లేనట్లేనా?

దసరా పండగ సందర్భంగా ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయినా అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ విషయంలో [more]

Update: 2020-10-14 02:22 GMT

దసరా పండగ సందర్భంగా ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయినా అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో దసరాకు రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయం సందిగ్దంలోనే ఉంది. కిలోమీటర్ల విషయంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కాలేదు. దసరా దగ్గరపడుతున్న సమయంలో ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పంతాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News