కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ

Update: 2018-11-15 09:38 GMT

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. రాజేంద్రనగర్ టిక్కెట్ దక్కని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానం టీడీపీకి వదిలేసింది కాంగ్రెస్. అయితే, తనకు టిక్కెట్ ఇస్తారో, రాజీనామా ఆమోదిస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ లో ఉన్న ప్రతీ కార్యకర్త పార్టీకి రాజీనామా చేస్తారని, ఎవరితో టీడీపీకి ఓట్లు వేయించుకుని గెలిపించుకుంటారో ఉత్తమ్ ఆలోచించుకోవాలన్నారు. ఇక, సబిత ఇంద్రారెడ్డి మాత్రం కాంగ్రెస్ లో కొనసాగనున్నారు. ఆమె మహేశ్వరం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ టిక్కెట్లు దక్కని మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, అరవింద్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ కి రాజీనామా చేశారు.

Similar News