నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై?

ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు [more]

Update: 2020-06-11 02:33 GMT

ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కరోనా నియంత్రణతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం కూడా కేబినెట్ లో చర్చించే అవకాశముంది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చించనున్నారు. కోవిడ్ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Tags:    

Similar News