అమిత్ షా వార్నింగ్

Update: 2018-06-23 13:04 GMT

జమ్మూ కశ్మీర్ ముమ్మాటికీ భారత్ లో అంతర్భాగమేనని, ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా కశ్మీర్ ను భారత్ నుంచి విడదీయలేరని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా స్పష్టం చేశారు. పీడీపీతో తెగదెంపుల తర్వాత ఆయన మొదటిసారిగా జమ్మూ కశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోదీ హయాంలో ఉగ్రవాదులు హతమయ్యారని, ఇంకా హతమవుతారని హెచ్చరించారు. మిట్టమధ్యాహ్నం ఓ జర్నలిస్టును హత్య చేయడం దారణమన్నారు. జవాన్లు, జర్నలిస్టుల హత్యలు జరుగుతుండగా ప్రభుత్వం నడవలేదని స్పష్టం చేశారు. సైన్యంసై రాళ్ల దాడి చేస్తున్న యువత సంఖ్య పెరగడం బాధాకరమన్నారు. జమ్మూ, లఖక్ లో అభివృద్ధి ఆగిపోయిందని, తమకు అధికారం ముఖ్యం కాదని, అభివృద్ధి ముఖ్యమన్నారు. అభివృద్ధి కోసమే పీడీపీతో తెగదెంపులు చేసుకున్నామన్నారు. రూ.15 వేల కోట్లు ఇచ్చినా శరణార్థులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు.అభివృద్ధికి తాము చేసిన ప్రయత్నాలను పీడీపీ అడుగడుగునా అడ్డుకుందన్నారు. కశ్మీర్ పై ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News