తాజ్ మహల్ వద్ద ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ ను సందర్శిస్తున్నారు. ట్రంప్ దంపతులతో పాటు ఆయన కూతురు ఇవాంకా కుటుంబం కూడా తాజ్ మహల్ ను [more]

Update: 2020-02-24 12:04 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ ను సందర్శిస్తున్నారు. ట్రంప్ దంపతులతో పాటు ఆయన కూతురు ఇవాంకా కుటుంబం కూడా తాజ్ మహల్ ను సందర్శించింది. ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ స్వాగతం పలికారు. తాజ్ మహల్ అందాలను ట్రంప్ దంపతులు వీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా నియమించిన గైడ్ ట్రంప్ దంపతులకు తాజ్ మహల్ నిర్మాణం, దాని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. అక్కడ విజిటర్స్ బుక్ లో ట్రంప్ దంపతులు సంతకాలు చేశారు. ఇద్దరూ తాజ్ మహల్ వద్ద ఫొటోలు దిగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రంప్, మెలానియాలు ప్రేమకు చిహ్మమైన తాజ్ మహల్ వద్ద సాయంసంధ్యలో గడిపారు.

Tags:    

Similar News