బాబుపాలనను ఎండగట్టిన మరో మాజీ సీఎస్

Update: 2018-04-13 09:39 GMT

రియల్ ఎస్టేట్ ఆలోచనలతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయందని, వ్యవస్థ నాశనమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్ కల్లాం మేలు కొలుపు అనే పుస్తకం రాశారు. ఏపీ కి కొత్త రాజధాని కేవలం పైరవీల కోసమేనని ఆయన పేర్కొన్నారు. క్యాపిటల్ పేరుతో డబ్బు దుబారా చేస్తున్నారన్నారు. మేకప్ వేసుకున్న వాళ్లంతా రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా రాజధాని అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో సీఎస్ గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు కూడా రాజధానిపై పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఈ ప్రభుత్వాల అజెండా ప్రజలకు పనికిరాదని ఆయన చెప్పారు. ఈ జనరేషన్ ప్రశ్నించేతత్వాన్ని కోల్పోయిందన్నారు.

Similar News