అగ్రిగోల్డ్ విషయంలో మాత్రం..?

Update: 2018-11-06 10:49 GMT

అగ్రిగోల్డ్ అంశంపై కాబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్నారు, 19లక్షల మంది బాధితులున్నారు. 30లక్షల మందికి పైగా ఖాతాలున్నాయి . అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ బాధితుల్ని రెచ్చగొడుతోందని మంత్రివర్గ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం చేసేలా ఏపీ కాబినెట్ ఒక ప్రతిపాదన చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్ములో 75శాతం కేంద్రం భరిస్తే, రాష్ట్రం 25శాతం భరిస్తుందని తెలిపింది. కోర్టు వివాదాలు పూర్తయ్యాక అదే నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు పంచుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. హాయిలాండ్ ఆఫ్ సెట్ వాల్యూ 500కోట్లు, 2 వేల కోట్లని బీజేపీ రెచ్చగొడుతోందని సమావేశంలో మంత్రులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి జిల్లా జడ్జి, కలెక్టర్,ఎస్పీ లతో త్రిసభ్య కమిటీ వేసి ఆస్తులు విక్రయించాలని నిర్ణయించింది. కేంద్రానికి చిత్త శుద్ధి ఉంటే 75 శాతం నిదులు ఇస్తే అప్పు చేసైనా 25 శాతం ఏపీ చెల్లిస్తుందని కేబినెట్ అభిప్రాయపడింది.

Similar News