ఏపీలో అవినీతిలో టాప్ వీరే

అవినీతి లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అగ్రభాగంలో నిలిచింది . తర్వాత స్థానంలో హోంశాఖ అవినీతిలో సంపాదించింది. ఆంధ్ర ప్రదేశ్ అవినీతి అధికారుల లెక్కల ను ఏసీబీ [more]

Update: 2020-01-02 11:34 GMT

అవినీతి లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అగ్రభాగంలో నిలిచింది . తర్వాత స్థానంలో హోంశాఖ అవినీతిలో సంపాదించింది. ఆంధ్ర ప్రదేశ్ అవినీతి అధికారుల లెక్కల ను ఏసీబీ విడుదల చేసింది. మొత్తం 243 కేసులకు సంబంధించి వివరాలను ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ మీడియాకు విడుదల చేసింది. ఇందులో ఈ సంవత్సరం 98 కేసుల్లో అవినీతి అధికారులను పట్టుకున్నట్లుగా తెలిపారు. 98 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఏసీబీ వెల్లడించింది. లంచం తీసుకుంటున్న 36 మంది రెవెన్యూ అధికారులను ఈ ఏడాది అరెస్ట్ చేశామని ఏసీబీ తెలిపింది. దీంతోపాటుగా హోంశాఖలో లంచాలు తీసుకుంటున్నారు 11 మంది అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు గా పేర్కొంది.

ఆదాయానికి మించి….

మరోవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు కూడా పెద్ద ఎత్తున అవినీతి ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది మొత్తం 96 మంది అవినీతి అధికారుల చేశామని ఏసీబీ వెల్లడించింది. దీంతో పాటుగా 23 మంది అధికారులు పైన కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి విచారణ చేస్తామని వెల్లడించింది. అలాగే 40 కోట్ల ఆకస్మిక తనిఖీలు చేశామని ఈ తనిఖీల్లో పెద్ద మొత్తం అక్రమాలు వెలుగు చేసినట్లుగా కూడా ఏసీబీ పేర్కొంది . మరోవైపు ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఇప్పటివరకు 44అంశాలపై సీక్రెట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా పేర్కొంది. మొత్తం ఏడాది 243 కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని ఏసీబీ పేర్కొంది.

Tags:    

Similar News