ఏసీబీకి చిక్కి ఏమంటున్నాడో చూడండి

Update: 2018-07-06 07:11 GMT

ఎర్రమంజిల్ లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సురేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు నిర్వ‌హించారు. సోమాజిగూడలోని అతని నివాసం కార్యాలయంతో పాటు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు జ‌రిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారని ఫిర్యాదులతో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ డీస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.

ప్రొద్దుటూరులో మూడు ప్రదేశాల్లో సురేష్ కుమార్ బంధువులు ఇళ్లలో సోదాలు చేస్తున్నామ‌ని వివ‌రించారు. మొత్తం 6 బ్యాంక్ లాకర్లు గుర్తించిన‌ట్లు, కొన్ని స్థిరాస్తులకి సంబంధించిన పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. 10 కి పైగా ప్లాట్లను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే, త‌న‌ ఆస్తులు అన్నీ ఎన్ ఆర్ ఐ గా ఉన్న కుమారుడు సంపాదించినవే అని, ఈ మధ్య‌కాలంలో తాను ఇల్లు మాత్రమే కొనుగోలు చేశాన‌ని, నా పై జరుగుతున్న ఏసీబీ దాడులను న్యాయపరంగా ఎదుర్కొంటాన‌ని సురేష్ కుమార్ తెలిపారు.

Similar News